Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..హెడ్ కానిస్టేబుల్ మృతి,మరొకరికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లో తరచూ ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది.

Update: 2024-09-28 19:23 GMT

దిశ, వెబ్‌డెస్క్:జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లో తరచూ ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది.సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతూనే ఉన్నాయి.తాజాగా కతువా(Kathua) జిల్లాలోని బిలావర్(Bilawar) ప్రాంతంలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల(Jaish-e-Mohammad terrorists)కు-భద్రతా బలగాల(Security Forces)కు ఎన్‌కౌంటర్‌(Encounter) కొనసాగుతోంది.ఈ ఎన్‌కౌంటర్‌లో హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్(Bashir Ahmad) మరణించగా,ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌(ASI)కు గాయాలు అయ్యాయని ఆర్మీ అధికారులు తెలిపారు.గాయపడిన ASIని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా,జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలను సేకరించామని, ఎన్‌కౌంటర్‌ స్థలం నుంచి 2 ఏకే 47 రైఫిళ్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని దక్షిణ కాశ్మీర్ డీఐజీ జావేద్ అహ్మద్ తెలిపారు.


Similar News