Mehbooba Mufti: హసన్ నస్రల్లా మృతికి సంఘీభావంగా ఒక రోజు ఎన్నికల ప్రచారానికి మెహబూబా ముఫ్తీ దూరం

జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి(Former CM),పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-28 18:45 GMT

దిశ, వెబ్‌డెస్క్:జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి(Former CM),పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజు తన ఎన్నికల ప్రచారానికి(campaign) దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు.కాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా లీడర్ (Hezbollah leader) హసన్ నస్రల్లా సహా పలువురు మృతి చెందారు. వీరి మృతికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ఈ విపత్కర సమయంలో పాలస్తీనా(Palestine),లెబనాన్(Lebanon) ప్రజలకు అండగా నిలుస్తామని ఆమె 'X' లో పోస్ట్ చేసారు.కాగా లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) శనివారం ప్రకటించింన విషయం తెలిసిందే.ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.నస్రల్లా ఇకపై ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టలేరు'అని X లో పోస్ట్ చేసింది. 


Similar News