ED: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి
ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ (ED) అధికారులపై దాడులు జరిగాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో సోదాలకు వెళ్లిన ఈడీ (ED) అధికారులపై దాడులు జరిగాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు. ఢిల్లీలోని బిజ్వాసన్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఈడీ అధికారులు(Attack on ED officials) పేర్కొన్నారు. ఈడీ (ED)లోని హై- ఇంటెన్సిటీ యూనిట్ (HIU) అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్ అకౌంటెంట్స్ లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగానే ఢిల్లీలో బిజ్వాసన్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు దుండగులు ఫర్నీచర్‌తో అధికారులపై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
యూఏఈకి చెందిన పీవైవైపీఎల్ తో..
యూఏఈకి చెందిన పీవైవైపీఎల్ పేమెంట్ అగ్రిగేటర్‌తో అనుసంధానించబడిన సైబర్ యాప్ మోసానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. క్యూఆర్ కోడ్, పిషింగ్, పార్ట్‌టైమ్ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌క్రైమ్‌లకు పాల్పడినట్లు ఆరోపించింది. అందులో భాగంగాంనే సీఏలు లక్ష్యంగా సోదాలకు పాల్పడ్డారు. కాగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న అశోక్ వర్మ, ఆయన సోదరుడు కూడా తమపై జరిగిన దాడిలో ఉన్నరని ఈడీ అధికారులు తెలిపారు. అక్రమ నిధులను వెలికితీసేందుకు సీఏలపై సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు.