రైతులకు కేంద్రం శుభవార్త..అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.
ఏప్రిల్- జూలై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి నెలల్లో మూడు వాయిదాలలో పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 16వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. 17వ విడత నిధులను జూన్ 18న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 9.26 కోట్ల మంది రైతులకు 17వ విడతగా రూ. 21,000 కోట్లకు పైగా ప్రధాని మోడీ విడుదల చేశారు.