లాలూకు సీబీఐ షాక్.. ఆ కేసులో మళ్లీ నోటీసులు
ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి 2018 సీబీఐ విచారణ ప్రారంభించింది. 2021లో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆయనపై అవినీతి కేసులో దర్యాప్తును సీబీఐ తిరిగి ప్రారంభించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూతో ఆర్జేడీ ఇటీవల జట్టుకట్టగా సీబీఐ నోటీసులు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు తేజస్వీయాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ నిందితులుగా ఉన్నారు.