మాజీ ముఖ్యమంత్రికి షాక్.. బెయిల్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

ఆర్జేడీ చీఫ్, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌కు సీబీఐ షాకిచ్చింది.

Update: 2023-08-18 10:40 GMT

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌కు సీబీఐ షాకిచ్చింది. దాణా కుంభకోణం కేసుల్లో ఆయనకు మంజూరైన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు లో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 25న విచారించనుంది. దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసుల్లో జైలు శిక్ష పడిన లాలూకు.. అనారోగ్య కారణాల రీత్యా 2022 ఏప్రిల్ చివరి వారంలో జార్ఖండ్ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

దీంతో ఆయన గతేడాది డిసెంబరులో సింగపూర్‌ కు వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. లాలూకు ఆయన కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేశారు. ఆ ఆపరేషన్‌ తర్వాత లాలూ కోలుకున్నారు. ఇటీవల విపక్ష కూటమి "ఇండియా" సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ.. సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Tags:    

Similar News