ఆర్‌జీ హాస్పిటల్ కేసు.. కీలక వ్యక్తిని అరెస్ట్ చేసిన సీబీఐ
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్ట్ చేసింది. ఆయన ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో కాలేజీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ దృష్టికి రావడంతో కొద్ది రోజుల క్రితమే సందీప్ ఘోష్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేసి కోల్‌కతాలోని నిజామ్ ప్యాలెస్‌లో ఉన్న సీబీఐ యాంటీ కరప్షన్ వింగ్ ఆఫీసుకు తరలించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ చేపట్టిన సీబీఐ.. ఘోష్‌తోపాటు కోల్‌కతాకు చెందిన మా తారా ట్రేడర్స్ ఆఫ్ మధ్య ఝోరేహట్, ఈషాన్ కేఫే, ఖామా లౌహా అనే మూడు ప్రయివేటు సంస్థల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి విచారణ చేస్తోంది. కాగా.. 15 రోజుల విచారణ అనంతరం తాజాగా సోమవారం సందీఫ్ ఘోష్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
కాగా.. ఆర్‌జీ హాస్పిటల్‌లో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విషయంలో ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కూడా మరో వైపు నుంచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.