Jindal Group: లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీనియర్ ఉద్యోగిపై కేసు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ గ్రూప్(Jindal Group) ఉద్యోగిపై కేసు నమోదైంది. జిందాల్ గ్రూప్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ కుమార్ సరోగిపై కోల్ కతా పోలీసులు కేసు పెట్టారు.

Update: 2024-07-21 09:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ గ్రూప్(Jindal Group) ఉద్యోగిపై కేసు నమోదైంది. జిందాల్ గ్రూప్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ కుమార్ సరోగిపై కోల్ కతా పోలీసులు కేసు పెట్టారు. ఇటీవల దినేశ్‌ కుమార్‌ తనతో అసభ్యంగా(molestation) ప్రవర్తించాడని కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. కోల్‌కతా-అబుదాబి విమానంలో(Flight) తనని వేధించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై ఇప్పటికే అబుదాబి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. కోల్‌కతాలోని బిధాన్‌నగర్ సిటీ పోలీసులు ఆదివారం దినేశ్‌ కుమార్‌పై కేసు పెట్టారు. న్యాయసంహితలోని సెక్షన్‌లు 74, 75 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ధర్యాప్తు ప్రారంభించినట్లు బిధాన్ నగర్ పోలీసులు తెలిపారు.

జిందాల్ గ్రూప్ ఛైర్మన్ ఏమన్నారంటే?

తనపై వేధింపులు కు పాల్పడినట్లు బాధిత మహిళ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. అతడిపై చర్య తీసుకోవాలని జిందాల్ గ్రూప్ ఛైర్మన్, బీజేపీ(BJP) ఎంపీ నవీన్ జిందాల్‌ను(Naveen Jindal) కోరారు. ఈ విషయంపై స్పందించిన ఆయన ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని తమ బృందాన్ని కోరామని, నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Similar News