Kolkata Doctor Rape-Murder: అవమానాన్ని భరించలేకపోతున్నా.. అందుకే రాజీనామా..!

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరోకీలకపరిణామం జరిగింది. భారీ నిరసల మధ్య ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు.

Update: 2024-08-12 07:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరోకీలకపరిణామం జరిగింది. భారీ నిరసల మధ్య ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సందీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. తనపేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నన్ను తొలగించాలని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. కానీ, నేను నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నా. నా పరువు తీస్తున్నారు. నేను చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా చూపిస్తున్నారు. చనిపోయిన అమ్మాయి నా కూతురిలాంటిది. నేను కూడా పేరెంట్ నే.. ఓ తండ్రిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా” అని తెలిపారు. తాను ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అని.. ఎక్కడైనా, జీవనోపాధి పొందగలనని మీడియాకు తెలిపారు. "నేను రాజీనామా చేయలేనని అందరూ అనుకున్నారు. నేను నిజాయితీపరుడిని. ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిని అరికట్టాను. ఆసుపత్రి అభివృద్ధికి మరియు రోగుల ప్రయోజనాల కోసం నేను పనిచేశాను" అని ఆయన చెప్పారు.

ప్రిన్సిపల్ పై బీజేపీ విమర్శలు

అంతకుముందు, బీజేపీ నేత సువేందు అధికారి డాక్టర్ ఘోష్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంజయ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు."ఈ విషాద సంఘటన తర్వాత ప్రిన్సిపల్ తప్పుదారి పట్టించే ప్రకటనలు, నిర్లక్ష్య వైఖరి బాధితురాలి పట్ల అతని ఉదాసీనతను బహిర్గంతే చేస్తున్నాయి" అని సువేందు అధికారి అన్నారు. ఈ ఘటనలో ప్రిన్సిపల్ సన్నిహితుల ప్రమేయం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని ఆరోపించారు. వారు ఇరుక్కోకుండా దర్యాప్తును ముగించడానికి పోలీసులు హడావిడిగా పనిచేస్తున్నారని అన్నారు. అధికారుల్లో సందీప్ ఘోష్ పలుకుబడి అధికంగా ఉందని అన్నారు. ఇకపోతే, కోల్ కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ లో 31 ఏళ్ల పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. అయితే, ఆమెపై అత్యాచారం జరిగిందని.. ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరచుగా వచ్చే సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు.


Similar News