ఇండోర్ ఆలయంలో అక్రమ కట్టడాల కూల్చివేత
మధ్యప్రదేశ్‌లో బెలెశ్వర్ మహాదేవ్ ఆలయంలో పైకప్పు కూలిన ఘటనలో భారీ మరణాలు చోటుచేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బెలెశ్వర్ మహాదేవ్ ఆలయంలో పైకప్పు కూలిన ఘటనలో భారీ మరణాలు చోటుచేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆలయంలోని అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించింది. బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారు. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆలయం వద్దకు చేరుకుని ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా చూసుకున్నారు.
ఈ విషాద ఘటనలో సుమారు 36 మంది మరణించారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. గతేడాది ఆలయ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ప్రయత్నించిన, ఆలయ సిబ్బంది జోక్యంతో నిలిచిపోయింది. ఈ క్రమంలో తాజా ఘటనతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టింది.