Budget 2024: విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ.1.48 లక్షల కోట్లు

ఈ ఏడాది బడ్జెట్(Union Budget) లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి సారించారు. విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం ఐదు పథకాలతో కూడిన ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించారు.

Update: 2024-07-23 06:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది బడ్జెట్(Union Budget) లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి సారించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(FM Nirmala sitharaman) రూ. 2 లక్షల కోట్ల కేటాయింపుతో విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం ఐదు పథకాలతో కూడిన ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాయి. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటిని నమోదు చేయనున్నారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు. గరిష్ఠంగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు దీనికి అర్హులు. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది.


Similar News