Budget 2024: గ్రామీణ ప్రాంత అభివృద్ధే లక్ష్యం

గ్రామీణ ప్రాంత అభివృద్ధికి బడ్జెట్ లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచింది.

Update: 2024-07-23 07:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గ్రామీణ ప్రాంత అభివృద్ధికి బడ్జెట్ లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచింది. గృహ నిర్మాణాల కోసం భారీగా నిధులు కేటాయించారు. అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్‌లో కేంద్రం మరోసారి పెద్దపీట వేసింది. రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మొత్తం జీడీపీలో 3.4 శాతానికి సమానంగా ఉండటం గమనార్హం.

యువతకు ఉద్యోగాల కల్పన

500 పెద్ద కంపెనీల్లో కోటికి మంది యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రం వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్లుకు నిర్మించనున్నట్లు ప్రకటించింది. 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.పీపీపీ విధానంలో డార్మిటరీ తరహాలో పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మించనుంది. అలానే కాశీ తరహాలో గయా ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. బిహార్ రాజ్ గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొదించింది. టూరిజం కేంద్రంగా నలందాను అభివృద్ధి చేస్తామంది.

బంగారం, వెండి, మొబైల్‌ ఫోన్లపై పన్ను తగ్గింపు

మొబైల్ ఫోన్లు పీసీడీఏ, ఛార్జరల్పై విధించే బేసిక్ కస్టమ్ డ్యూటీని 15 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు కాస్తతగ్గనున్నాయి. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించనున్నట్లు తెలిపింది. బంగారం, వెండిపై 6 శాతానికి సుంకం తగ్గించగా.. ప్లాటినమ్ పై 6.4 శాతం పన్ను తగ్గించినట్లు పేర్కొంది.


Similar News