BREAKING: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. కొత్త పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-24 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగలకు సామాజిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా వారి స్థితిగతులను దృష్టి పెట్టుకుని యునైటెడ్ పింఛన్ పేరుతో కొత్త పెన్షన్‌ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పథకం అమలుకు గాను రూ.10,579 కోట్లు వ్యయం కానుంది. పాతికేళ్ల పాటు సర్వీసులు పూర్తి చేసుకున్న సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కానున్నారు. అదే విధంగా బయో ఈ-3 విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవాన్ని తీసుకురానున్నారు. దీంతో బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. టెక్నాలజీతో ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ ఏర్పడనున్నాయి. ఇక విద్యా రంగంలోనే కీలక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. 11, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ.. విజ్ఞాన్ ధార పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 


Similar News