BREAKING: కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం.. నేడు భారత్ బంద్‌కు పిలుపు

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరింది.

Update: 2024-02-16 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నాలుగో రోజుకు చేరింది. నిన్న కేంద్ర మంత్రులతో రైతులు జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో పలు రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అదేవిధంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందుకున రాజధానిలో ఢిల్లీలో సభలు, సమావేశాలు పూర్తిగా నిషేధం కొనసాగుతోంది. నోయిడాకు చెందిన భారతీయ కిసాన్ పరిషత్ దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వడంతో ఆందోళనను తీవ్రతరం చేస్తామని రైతులు ఇవాళ ప్రతిజ్ఞ చేశారు. ముగ్గురు కేంద్ర మంత్రులు, రైతులకు మధ్య ఐదు గంటల పాటు సుధీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ శుక్రవారం కూడా ఎలాంటి పురోగతి లేదు. ఆదివారం మరోమారు కేంద్ర మంత్రులు రైతులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతివ్వాలని 200 రైతు సంఘాలకు పిలుపు కూడా ఇచ్చాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు భారీ సంఖ్యలో రైతులు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను మూసివేశారు. 


Similar News