భావోద్వేగానికి లోనైన ప్రధాని మోడీ.. నామినేషన్ వేళ అమ్మ మాటలు తలుచుకుంటూ కన్నీళ్లు
లోక్‌సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ జాతీయ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గంగామాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ, ఆప్యాయత తనను ‘బనారస్’గా మార్చిందని మోడీ అన్నారు. కాశీతో తనకున్న 10 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోనషనల్ అయ్యారు. సాక్షాత్తు ఆ గంగామాతే తనను పిలిచిందని, ప్రతి పనిని భగవంతుని ఆరాధనగా భావించి చేస్తానని తెలిపారు. ప్రజల ప్రేమను చూస్తుంటే తనపై ఉన్న బాధ్యతలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. తన తల్లికి వందేళ్లు నిండిన సందర్భంగా ఆమె పెట్టినరోజుకు వెళ్లినప్పుడు ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మరచిపోవద్దని అమ్మ చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి, స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని తన తల్లి చెప్పిందని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు.