దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు.. మూడు ఎయిర్ పోర్టుల వద్ద హై అలర్ట్

దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. బీహార్‌లోని పట్నా, రాజస్థాన్‌లోని జైపూర్, మధ్యప్రదేశ్‌లోని

Update: 2024-06-18 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. బీహార్‌లోని పట్నా, రాజస్థాన్‌లోని జైపూర్, మధ్యప్రదేశ్‌లోని వడోదర ఎయిర్ పోర్టుల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పోలీసులకు మెయిల్ చేశారు. ఎయిర్ పోర్టులను బ్లాస్ట్ చేస్తామని మెయిల్‌లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. బెదిరింపు మెయిల్స్ వచ్చిన పట్నా, జైపూర్, వడోదర ఎయిర్ పోర్టుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పట్నా, జైపూర్, వడోదర విమానాశ్రయాల వద్ద భారీగా భద్రతను పెంచారు. బాంబ్ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News