Bomb hoax: కెనడా ఎయిర్ ఫోర్స్ విమానంలో ఎయిరిండియా ప్రయాణికుల తరలింపు

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా(Air India) విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

Update: 2024-10-16 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా(Air India) విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, చికాగో వెళ్తున్న ఏఐ127 విమానాన్ని కెనాడాలోని ఇకాలుత్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సుమారు 18 గంట‌లు పాటు అక్క‌డే ఆ విమానంలోని ప్ర‌యాణికులు ఉండిపోయారు. 211 మంది ప్ర‌యాణికులు ఆ ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నారు. వీరితో పాటు మ‌రో 20 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ ప్ర‌యాణికుల‌ను చికాగోకు త‌ర‌లిస్తున్నారు. కెన‌డా వైమానిక ద‌ళానికి చెందిన విమానంలో ఆ ప్ర‌యాణికుల‌ను పంపిస్తున్నారు. భద్రతాముప్పు కారణంగా విమానాన్ని ఇకాలుత్ లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రయాణికులందరినీ ఎయిర్‌లైన్స్ రీ-స్క్రీనింగ్ చేస్తున్నాయని వెల్లడించింది. కెన‌డా ఎయిర్‌ఫోర్స్ విమానంలో ప్ర‌యాణికుల‌ను చికాగోకు త‌ర‌లిస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇకాలుత్ ఎయిర్‌పోర్టులో త‌మ విమానాన్ని దింపేందుకు స‌హ‌క‌రించిన కెన‌డా అధికారుల‌కు ఎయిర్ ఇండియా థ్యాంక్స్ తెలిపింది.

కెనడాకు తరలింపు

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్ విమానాన్ని బాంబు బెదిరింపు రావ‌డంతో మంగ‌ళ‌వారం కెన‌డాకు త‌ర‌లించారు. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదు. గతకొంతకాలంగా విమానయాన సంస్థలు అనేక బెదిరింపులకు గురవుతున్నాయని ఎయిరిండియా తెలిపింది. మ‌రో వైపు గ‌త రెండు రోజుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 10 భార‌తీయ విమానాల‌కు బాంబు బెదిరింపు వ‌చ్చింది. కానీ ఎటువంటి అనుమానిత వ‌స్తువుల‌ను గుర్తించ‌లేదు.


Similar News