Boat carrying: టీఎంసీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. కారణమిదే?

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు భారీ ప్రమాదం తప్పింది.

Update: 2024-09-19 03:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు భారీ ప్రమాదం తప్పింది. బీర్ భూమ్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. దీంతో వారంతా నీటిలో పడిపోగా వెంటనే అప్రమత్తమైన స్థానికులు, రెస్య్కూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సేఫ్టీ జాకెట్లు ధరించని ప్రజా ప్రతినిధులను రక్షించారు. దీంతో టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సహా 13 మంది ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇందులో లబ్‌పూర్‌కు చెందిన ఎమ్మెల్యే అభిజిత్ సింగ్, పార్టీ ఎంపీలు, అసిత్ మల్, షమీరుల్ ఇస్లాం, బీర్‌భూమ్ జిల్లా మేజిస్ట్రేట్ బిధాన్ రాయ్ ఇతర అధికారులు ఉన్నారు. వీరంతా బలరాంపూర్, ల్యాబ్‌పూర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను పడవలో పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు క్యూ నది ఆనకట్ట తెగిపోవడంతో ల్యాబ్‌పూర్‌లోని 15 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాలను వారు పరిశీలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.


Similar News