అభ్యర్థుల పేర్లు ఖరారు.. తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది.

Update: 2023-08-17 12:52 GMT

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌కు 21 మంది అభ్యర్థులను, 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌కు 39 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన మరుసటి రోజే ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌‌కు అనౌన్స్ చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘేల్‌ సిట్టింగ్ అసెంబ్లీ స్థానం పటాన్‌ నుంచి బీజేపీ ఎంపీ విజయ్‌ బఘేల్‌‌కు టికెట్ ఇచ్చారు. విజయ్‌ బఘేల్‌‌కు భూపేష్ బాఘేల్‌ మేనమామ అవుతారు. ఇక మధ్యప్రదేశ్‌కు ప్రకటించిన 39 మంది అభ్యర్థులలో ఐదుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల వివరాలను తొలి జాబితాలో విడుదల చేశారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.


Similar News