ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం త్రిపురకు భయం, హింస నుంచి స్వేచ్ఛ కల్పించిందని అన్నారు. శనివారం ధలై జిల్లాలో నిర్వహించిన ఎన్నికల

Update: 2023-02-11 10:39 GMT

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం త్రిపురకు భయం, హింస నుంచి స్వేచ్ఛ కల్పించిందని అన్నారు. శనివారం ధలై జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పాలకులు త్రిపుర అభివృద్ధి అడ్డుకున్నారు. బీజేపీ ప్రభుత్వం త్రిపురకు అభివృద్ధిని తీసుకొచ్చింది. రాష్ట్రంలో హింస తాలూకూ అనవాలు ఇకపై ఉండవు. బీజేపీ ప్రభుత్వం త్రిపురకు హింస, భయం నుంచి విముక్తి కల్పించింది' అని అన్నారు. గతంలో పోలీస్ స్టేషన్లను సీపీఎం కేడర్ కబ్జా చేసిందని.. బీజేపీ ప్రభుత్వంలో ఆ నియమం మారిందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మహిళ సాధికరతతో జీనొనపాధి మెరుగుపడిందని తెలిపారు. తమ హాయాంలో గ్రామాలను అనుసంధానిస్తూ 5వేల కిలోమీటర్ల మేర రోడ్లు, కొత్త విమానశ్రయం, ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని యువత, పేదలు, తల్లి కూతుళ్లు, ఆదివాసీల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించినట్లు చెప్పారు. తప్పుడు పాలన నుంచి త్రిపురకు కొంత కాలం కిందటే స్వేచ్ఛ లభించిందిన అన్నారు. గృహకల్పన, ఆరోగ్యం, ఆదాయంలో ముందుకు తీసుకువెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. ఓట్ల కౌంటింగ్ మార్చి 2న చేపట్టనున్నారు.

Tags:    

Similar News