స్వతంత్ర మాజీ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపిన బీజేపీ

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత విధానసభకు రాజీనామా అదే పార్టీలో చేరిన ముగ్గురు స్వతంత్ర మాజీ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థులుగా బరిలోకి దింపింది.

Update: 2024-06-14 04:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత విధానసభకు రాజీనామా అదే పార్టీలో చేరిన ముగ్గురు స్వతంత్ర మాజీ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థులుగా బరిలోకి దింపింది. ఇటీవల విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. హమీర్‌పూర్ నుంచి ఆశిష్ శర్మ, డెహ్రా నుంచి హోషియార్ సింగ్, నలాగఢ్ నుంచి కేఎల్ ఠాకూర్ తమ తమ నియోజకవర్గాల నుంచి జులై 10న జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే కాషాయ పార్టీ వీరిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో కలిసి బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేలు మార్చి 22న సభకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆరుగురు తిరుగుబాటుదారుల స్థానాలు, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 3న ఈ ముగ్గురి రాజీనామాలను స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఆమోదించారు. ఆ తర్వాత ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడైన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలకు గానూ కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఇంచార్జ్‌లను నియమించుకోగా ఇక్కడ ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు గట్టిగా పోరాడుతున్నాయి.


Similar News