బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ షురూ: సెంటిమెంట్ సాంగ్‌తో ప్రారంభించిన నడ్డా

2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ గురువారం ప్రారంభించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోడీ సమక్షంలో ‘సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై’ అనే ప్రచార గీతాన్ని రిలీజ్ చేసి అధికారికంగా క్యాంపెయిన్ ప్రారంభించారు.

Update: 2024-01-25 07:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ గురువారం ప్రారంభించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధాని మోడీ సమక్షంలో ‘సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై’ అనే ప్రచార గీతాన్ని రిలీజ్ చేసి అధికారికంగా క్యాంపెయిన్ ప్రారంభించారు. భారతీయుల కలలు, ఆకాంక్షలను ప్రధాని మోడీ ఎలా నిజం చేశారు, వివిధ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ పాటను రూపొందించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాం లల్లా ప్రస్తావన కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలందరూ ఈ సాంగ్‌ను దేశం నలుమూలలకూ వ్యాపింప జేయాలని నడ్డా కోరారు. ‘ప్రధాని మోడీ కలలను వాస్తవంగా మార్చారు. తన వాగ్దానాలకు హామీ ఇస్తున్నారు. 500ఏళ్ల నాటి కలను కూడా సాకారం చేశారు’ అని నడ్డా కొనియాడారు.

యువత ఆత్మ నిర్భర్‌గా మారారు

‘మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు కోట్లాది కలలను సాకారం చేశాయి. యువత స్టార్టప్‌లు, వ్యవస్థాపక రుణాల ద్వారా ఉద్యోగాలు పొంది ఆత్మనిర్భర్‌గా మారారు. రైతులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా అమ్ముకోవచ్చు. బీజ్ నుంచి బజార్ వరకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని స్థాయిల్లోనూ దేశ పురోగతిలో సమాన వాటాదారులుగా ఉన్నారు’ అని నడ్డా అన్నారు. అంతేగాక మోడీ హయాంలో పేదలు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ సామర్థ్యంపై భారత్ ఎంతో విశ్వాసంతో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో అనేక భాగాలు ఉంటాయని త్వరలోనే వాటిని షెడ్యూల్ చేయనున్నట్టు నడ్డా వెల్లడించారు. 

Tags:    

Similar News