Adani: ఒకరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మరొకరిపై రుద్దొద్దు- గౌతమ్ అదానీ
వర్క్-లైఫ్ బ్యాలెన్స్(work-life balance) గురించి ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: వర్క్-లైఫ్ బ్యాలెన్స్(work-life balance) గురించి ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) కీలక వ్యాఖ్యలు చేశారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మీడియాతో ఆయన మాట్లాడారు. "ఒకరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మరొకరిపై రుద్దొద్దు. ఎవరైనా కుటుంబంతో నాలుగు గంటలు గడిపితే ఆనందం పొందుతారు. అదే, ఎనిమిది గంటలు గడుపుతా అంటే.. బీవీ భాగ్ జాయేగీ (భార్య పారిపోతుంది). మీకు నచ్చిన పనులు చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డ్ గా ఉంటుంది. మాకు కుటుంబం లేదా పని.. ఇవి తప్ప వేరే ప్రపంచం లేదు. పిల్లలు కూడా దాన్ని మాత్రమే చూస్తారనే విషయాన్ని గమనించింది. భూమిపైకి ఎవరూ శాశ్వతంగా ఉండేందుకు రాలేదు. దీన్ని అర్థం చేసుకున్నప్పుడే జీవితం సరళంగా మారుతుంది" అని అదానీ అన్నారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు
ఇకపోతే, పనివారాలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి(Infosys Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు( 70 Hour Workweek) పని చేయాలని నారాయణమూర్తి అన్నారు. అలాగే, భారత్ వారానికి ఐదు రోజుల పని దినాలు ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై నాకు నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో ఈ అంశంపై గౌతమ్ అదానీ స్పందించారు.