BIG BREAKING: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి అధికారం దక్కకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన సీట్లు సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి అధికారం దక్కకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన సీట్లు సాధించింది.18వ లోక్‌సభలో కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో లోక్‌సభలో విపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై సస్పెన్స్ వీడింది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అన్ని పార్టీ సభ్యులు కలిసి సంయూక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, గత రెండు దఫాలుగా ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి పదేళ్ల తరువాత లోక్‌సభలో రాహుల్ గాంధీ విపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు. అయితే, రాహుల్ ఎన్నికను సీపీపీ నేత సోనియా గాంధీ లేఖ ద్వారా ప్రొటెం స్పీకర్‌కు తెలిపారు.