చేతిలో రాజ్యాంగ ప్రతితో రాహుల్ గాంధీ ఎంపీగా ప్రమాణ స్వీకారం

రాహుల్ గాంధీ ప్రమాణం చేయడానికి పిలిచిన సమయంలో ఇండియా కూటమి సభ్యులంతా బల్లలు చరిచి, భారత్ జోడో నినాదాలు వినిపించారు.

Update: 2024-06-25 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తవగా, మంగళవారం మిగిలిన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ కీలకనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ ప్రమాణం చేయడానికి పిలిచిన సమయంలో ఇండియా కూటమి సభ్యులంతా బల్లలు చరిచి, భారత్ జోడో నినాదాలు వినిపించారు. రాహుల్ గాంధీ ప్రమాణం చేయడానికి ముందు కొద్దిసేపు చేత్తో భారత రాజ్యాంగం ప్రతిని పట్టుకున్నారు. ప్రమాణం పూర్తయిన తర్వాత జై రాజ్యాంగం అంటూ నినదించారు. అనంతరం ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఇదే తరహాలో రాజ్యాంగ ప్రతిని చేత్తో పట్టుకుని ప్రమాణం చేయడం విశేషం. కాగా, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. రెండుచోట్లా గెలవడంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు ఇటీవల నిర్ణయించారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. 


Similar News