Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్‌..రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ

కేంద్ర ప్రభుత్వం(Central Govt) దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు(Senior Citizens) సైతం ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని(AB PMJAY) వర్తింపజేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-29 23:15 GMT

దిశ, వెబ్‌డెస్క్:కేంద్ర ప్రభుత్వం(Central Govt) దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు(Senior Citizens) సైతం ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని(AB PMJAY) వర్తింపజేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్‌ (Scheme) కింద అర్హులైన వారి పేర్ల నమోదు ప్రక్రియ(Registration Process) చేపట్టాలని అన్ని రాష్ట్రాలు(All States), కేంద్రపాలిత ప్రాంతాల(UT)కు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఎల్‌.ఎస్‌. చాంగ్‌సన్‌ (L.S. Changsan) అన్ని రాష్ట్రాలు,UTలకు లేఖ రాశారు.ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్‌ సిటిజన్ల నమోదు కోసం ఆయుష్మాన్‌ మొబైల్‌ యాప్‌(Ayushman Mobile App), వెబ్‌సైట్‌(Beneficiary.nha.gov.in)లో ప్రత్యేక సదుపాయం కలిపించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.వీటిలో పేర్లు నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు (Ayushman Card) జారీ చేస్తామని తెలిపింది.కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ హెల్త్ కార్డు అందిస్తారు. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ కార్డుతో రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందవచ్చు.


Similar News