Amit Shah : మా పార్టీలను చీల్చమని బీజేపీ నేతలకు అమిత్ షా చెప్పారు : ఉద్ధవ్ థాక్రే

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు.

Update: 2024-09-29 19:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ‘‘ఇటీవలే నాగ్‌పూర్‌లో పర్యటించిన అమిత్‌షా..మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ఒక అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీలను మరింతగా చీల్చమని ఆ సందర్భంగా బీజేపీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి సూచించారు’’ అని ఉద్ధవ్ ఆరోపించారు. ‘‘విపక్ష పార్టీల నేతల నడుమ చిచ్చుపెట్టడం, చీల్చడం అనే కుట్రల గురించి రహస్య సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఏముంది? నేరుగా ప్రజల ముందే ఆ మాటలను అమిత్‌షా చెప్పి ఉండాల్సింది’’ అని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని రాంటెక్ నగరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌లకు చెందిన రాజకీయ పార్టీలు బలహీనపడితే మహారాష్ట్రను దోచుకునేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అవుతుందన్నారు. ఇతర పార్టీలను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ హిందుత్వ వాదనతో ఆర్ఎస్ఎస్ గొంతు కలుపుతుండటంపై ఉద్ధవ్ థాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Similar News