ఇక ప్రతి మండలంలో ఆయుష్ స్టోర్స్

ఇకపై ప్రతీ మండలంలో ఆయుష్ స్టోరేశ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-08-26 16:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై ప్రతీ మండలంలో ఆయుష్ స్టోరేశ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుర్వేద ఔషధాలకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వెల్లడించారు. ఆయుష్ ఔషధాలకు మార్కెట్ పెంచేలా దేశంలోని ప్రతీ మండలంలో ఒక ఆయుష్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. ఆయుష్ లో మంచి మందులు ఉన్నప్పటికీ వాటికి తగిన గుర్తింపు లేదన్నారు. సాధారణ మెడికల్ షాపుల్లో కొన్ని ఆయుష్ మందులు మాత్రమే లభ్యమవుతున్నాయని.. దీని వలన ఆయుర్వేద వైద్యులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకే ఆయుష్ మెడికల్ స్టోర్స్ అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. సోమవారం ఇండోర్, దేవాస్, ఉజ్జయినిలోని ఆయుష్ ఆస్పత్రులను సందర్శించిన అనంతరం మంత్రి ఈ ప్రకటన జారీ చేశారు.    


Similar News