Atishi : నేడు ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారోత్సవం

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2024-09-20 19:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ వేదికగా నిలునుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈసందర్భంగా ఆప్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం. అయితే మూడో మహిళా సీఎంగా సరికొత్త రికార్డును ఆమె క్రియేట్ చేస్తుండటం విశేషం. 


Similar News