భారత్‌లో మైనార్టీ హక్కులపై యూఎస్‌ మీడియా ప్రశ్న.. మోదీ దీటైన జవాబు

భారత్‌లో మైనారిటీల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ అమెరికా మీడియా సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోడీ దీటైన జవాబిచ్చారు.

Update: 2023-06-23 14:40 GMT

వాషింగ్టన్: భారత్‌లో మైనారిటీల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ అమెరికా మీడియా సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోడీ దీటైన జవాబిచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం తర్వాత మోడీ మీడియాతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో మైనారిటీల హక్కులను మెరుగు పరిచేందుకు ఏం చర్యలు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. ‘మీ ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజాస్వామ్యం మా రక్తంలోనే ఉంది. మానవ హక్కులు, విలువలు లేకుంటే దాన్ని ప్రజాస్వామ్యమే అనరు. మా రాజ్యంగంలోనే ప్రజాస్వామ్యం ఉంది.

అలాంటప్పుడు మత, కుల, జాతి, వయసు, ప్రాంతం అనే వివక్షకు తావులేదు. 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్'.. అనే నినాదంతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తోంది’ అని మోడీ కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశానికి ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. భారత్‌లో ముస్లిం మైనారిటీల హక్కులపై ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఎదుట బైడెన్ ఈ విషయాన్ని కచ్ఛితంగా ప్రస్తావించాలన్నారు. మైనారిటీలను రక్షించకుంటే ఆ దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


Similar News