PM Modi : ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో శాంతిస్థాపనపై మోడీ కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్(Ukraine), పశ్చిమాసియాలను యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఆందోళన రేకెత్తిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

Update: 2024-10-25 14:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్(Ukraine), పశ్చిమాసియాలను యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఆందోళన రేకెత్తిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపనకు ప్రయత్నాలు చేయడానికి భారత్ సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఏ సమస్యకైనా యుద్ధంతో పరిష్కారాన్ని కనుగొనలేమని మోడీ (PM Modi)  చెప్పారు.

న్యూఢిల్లీలో జర్మన్ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు, సంఘాలు.. 21వ శతాబ్దంలో తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలను చూపలేవని మోడీ, ఒలాఫ్ షోల్జ్‌ ఈసందర్భంగా అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలను ఉద్దేశించి పరోక్షంగా ఈ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. 

Tags:    

Similar News