చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయండి.. Arvind Kejriwal పిలుపు

ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Update: 2022-12-18 10:21 GMT

న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవ సరిహద్దుల వెంబడి చొరబాట్లకు పాల్పడినందుకు చైనాను శిక్షించే బదులు మోడీ ప్రభుత్వం బహుమతి ఇచ్చిందని సెటైర్లు వేశారు. చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు. చైనా దూకుడు పెరుగుతున్నా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నా కూడా అంతా బాగానే ఉందన్న కథనాన్ని రూపొందించడమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. చైనాతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి కేంద్రానికి జరుగుతున్న బలవంతం ఏమిటని ప్రశ్నించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలను కోరారు. భారతీయులను తరిమికొడుతూ.. చైనా ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారని కేంద్రంపై మండిపడ్డారు. 2020-21లో కేంద్రం వాణిజ్యం 44.03 మిలియన్ డాలర్ల పోలిస్తే 2021-22లో 73.31 బిలియన్ల డాలర్లకు పెరిగింది.

Tags:    

Similar News