Army officer: ఎన్‌సీసీ క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి.. కేరళలో ఘటన

ఎన్‌సీసీ క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి జరిగింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ నెల 23న ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-12-30 13:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) క్యాంపులో ఆర్మీ అధికారిపై దాడి జరిగింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ నెల 23న ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎంఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ కళాశాల విద్యార్థులకు త్రిక్కక్కరాలో ఎన్‌సీసీ క్యాంప్ జరుగుతోంది. అయితే ఈ నెల 23న రాత్రి భోజనం చేసిన తర్వాత 80 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉండటంతో వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థి సంఘం నేతలు, స్థానిక బీజేపీ కౌన్సిలర్ ప్రమోద్ వారి మద్దతు దారులతో కలిసి క్యాంపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే క్యాంపును నిర్వహిస్తున్న ఆర్మీ అధికారిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ కర్నైల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News