ప్రతీకారం తీర్చుకున్న ఇండియన్ ఆర్మీ.. ఉరిలో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్ లోయలో తుపాకుల మోత దద్దరిల్లుతోంది. గత నాలుగు రోజులుగా అనంత్‌నాగ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లతో ఉగ్రవాదుల వేట సాగిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్ లోయలో తుపాకుల మోత దద్దరిల్లుతోంది. గత నాలుగు రోజులుగా అనంత్‌నాగ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రోన్లతో ఉగ్రవాదుల వేట సాగిస్తున్నారు. ఇటీవల అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పుల్లో ఒక కల్నల్ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందారు.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ మరింత స్పీడ్ పెంచారు. ఇవాళ బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ, పోలీసులు, నిఘా సంస్థలు సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అప్రమత్తమైన బలగాలు గమనించిన ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. ఉగ్రవాదులు, బలగాల మధ్య కాల్పులు మొదలైనాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు అనంత్ నాగ్ లో భారీ వర్షంలోనే భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.