మరో ఖలిస్తాన్ మద్దతుదారుడిపై ఎన్ఐఏ కొరడా.. ఆస్తులు జప్తు

Update: 2023-10-11 12:59 GMT

చండీగఢ్: మరో ఖలిస్తాన్ మద్దతుదారుడు లఖ్బీర్ సింగ్ రోడ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొరడా ఝుళిపించింది. బుధవారం పంజాబ్‌లోని మోగాలో సోదాలు చేసిన ఎన్ఐఏ.. ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) అధినేత లఖ్బీర్ ఆస్తుల్ని జప్తు చేసింది. మోగా పరిధిలోని లఖ్బీర్ సింగ్ పూర్వీకుల గ్రామంలోని 11 ఆస్తులను జప్తు చేశామని ఎన్ఐఏ అధికార వర్గాలు వెల్లడించాయి.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద చర్యలు తీసుకోవాలని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగానే ఈ సోదాలు చేశామని తెలిపాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు మేనల్లుడే లఖ్బీర్ సింగ్. ఇతడిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. ఆర్డీఎక్స్ తో పాటు పలు ఆయుధాలు, పేలుడు పదార్థాల స్మగ్లింగ్ తో పాటు పలువురు కీలక నాయకులపై దాడికి కుట్ర పన్నిన కేసులో అతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.


Similar News