సుప్రీం కోర్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ అనుబంధ పత్రిక
ఆరెస్సెస్ వారా పత్రిక పాంచజన్య సుప్రీంకోర్టు పై కీలక వ్యాఖ్యలు చేసింది.
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ వారా పత్రిక పాంచజన్య సుప్రీంకోర్టు పై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యతిరేక శక్తులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై కథనంలో పేర్కొంది. 'దేశ ప్రయోజనాలను సురక్షితంగా ఉంచేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటైంది. అయితే దీనిని దేశ వ్యతిరేక శక్తులు సాధనంగా వాడుకుని వారి మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నారు' అని తెలిపింది.
పర్యావరణం పేరుతో దేశ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తూ, మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను రక్షించే ప్రయత్నం చేసిన తర్వాత, ఇప్పుడు భారత్‌ను వ్యతిరేకించే శక్తులకు భారత్‌లోనే వ్యతిరేకంగా ప్రచారం చేసే హక్కు ఉండాలని ప్రయత్నిస్తున్నారని సంపాదకీయంలో పేర్కొంది. బీబీసీ డాక్యుమెంటరీ దేశాన్ని తక్కువ చేసే ప్రోపగాండా అని వర్ణించింది. ఇది పూర్తి తప్పేనని, ఊహజనితమని తెలిపింది. సుప్రీంకోర్టు పన్ను చెల్లింపు దారుల డబ్బుతో నడుస్తుందని, దేశ ప్రయోజనం కొరకే పనిచేస్తుందని పేర్కొంది.
Also Read...
కాబోయే ప్రధాని నితీశ్ కుమారేనా...? క్లారిటీ ఇచ్చిన బీహార్ సీఎం