తమిళనాడులో మరో రాజకీయనాయకుడి దారుణ హత్య

తమిళనాడులోని మధురైలో నామ్ తమిజర్ కట్చి పార్టీ (ఎన్‌టీకే) కార్యకర్త బాలసుబ్రమణియన్ దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-07-16 08:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని మధురైలో నామ్ తమిజర్ కట్చి పార్టీ (ఎన్‌టీకే) కార్యకర్త బాలసుబ్రమణియన్ దారుణ హత్యకు గురయ్యాడు. బాలసుబ్రమణియన్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. కాగా.. ఇది రాజకీయ హత్య కాదని పోలీసులు తేల్చి చెప్పారు. బాలసుబ్రమణియన్ కి మూడు హత్య కేసుల్లో ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ప్రతీకార దాడి అని వెల్లడించారు. ఇది కుటుంబ కలహాల కారణంగా జరిగిన జరిగిన హత్య అని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

బీఎస్పీ చీఫ్ హత్య

బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు చీఫ్ కె. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఇది జరిన వారం తర్వాతే బాలసుబ్రమణియన్ హత్య జరగడం గమనార్హం. గ్యాంగ్‌స్టర్ ఆర్కాట్ సురేష్ హత్యకు ప్రతీకారంగా ఆర్మ్‌స్ట్రాంగ్ ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సురేశ్ హత్యకు ఆర్మ్‌స్ట్రాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో పదకొండు మంది నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు.


Similar News