అనంత్ అంబానీ పెళ్లి..హాజరయ్యే అతిథులు వీరే?

భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం జరగనున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికతో ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో పెళ్లి జరగనుంది.

Update: 2024-07-11 14:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం జరగనున్న విషయం తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికతో ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో పెళ్లి జరగనుంది. అయితే ఈ వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి మోడీ సహా విదేశీ అతిథులు సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లు హాజరు కానున్నారు.

విదేశీ అతిథులు వీరే?

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, ఇటలీ మాజీ ప్రధాని మాటియో రెంజీ, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్, టాంజానియా అధ్యక్షుడు హెచ్ ఈ సమియా సులుహు హసన్, ఆస్ట్రియా మాజీ ప్రధాని సెబాస్టియన్ కుర్జ్, ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ) వైస్ ప్రెసిడెంట్ జువాన్ ఆంటోనియో సమరాంచ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్లూటీఓ) డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవెలా, ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో, స్వీడిష్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్‌లు వివాహానికి హాజరుకానున్నారు.

ఘనంగా సంగీత కార్యక్రమం

ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో గొప్ప సంగీతాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ థీమ్ ఇండియన్ రీగల్ గ్లాం. బాద్‌షా కరణ్ ఔజ్లా కొన్ని పంజాబీ బీట్ లతో అలరించనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నట్టు సమాచారం.  


Similar News