సేఫ్‌గా ల్యాండ్ అయిన విమానం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

ఎయిరిండియా విమానం(Air India flight) సేఫ్‌గా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు సేఫ్‌గా ల్యాండైంది.

Update: 2024-10-11 14:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా విమానం(Air India flight) సేఫ్‌గా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు సేఫ్‌గా ల్యాండైంది. దీంతో విమానంలోని 141 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అంతుకుముందు.. విమానం గాల్లో ఉండగా.. పైలట్ ఎమర్జెన్సీ(Emergency) ప్రకటించారు. హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో అంతా కంగారు పడ్డారు. సుమారు రెండు గంటల తర్వాత తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు.


Similar News