Amit Shah: జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవాలి.. కేంద్ర మంత్రి అమిత్ షా

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మధ్య సమన్వయం ఉండాలని అమిత్ షా సూచించారు.

Update: 2024-09-14 17:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద చర్యలను నియత్రించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) మధ్య సమన్వయం ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ భద్రతా వ్యూహాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉగ్ర చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 2047 నాటికి దేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీలకు సూచించారు. జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు, మాదక ద్రవ్యాలు వంటి జాతీయ భద్రతా సవాళ్లను గుర్తించాలన్నారు. అవి దేశ వ్యాప్తంగా విస్తరించి సవాళ్లుగా మారకముందే అంతం చేయాలని పిలుపునిచ్చారు.

మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేస్తున్నందున రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చూడాలని తెలిపారు. టెక్నాలజీని స్వీకరించడం ద్వారా మాత్రమే కొత్త చట్టాలు ప్రభావం కనపడుతుందని నొక్కి చెప్పారు. ఈ చట్టాలపై యువ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. మల్టీ డైమోన్షనల్ విధానం, డేటా అనలిటిక్స్, కొత్త టెక్నిక్‌లను ఉపయోగించి అంతర్గత భద్రతా నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న అత్యాధునిక టెక్నాలజీని రాష్ట్రాల్లోనూ వినియోగించుకునేలా చేయాలని డీజీపీలను కోరారు. 


Similar News