అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-07-06 09:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాత్రికుల భద్రత కోసం ముందస్తు చర్యగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, ఈఏడాది మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్‌లోని నున్వాన్-పహల్గామ్ మార్గం, గందర్‌బాల్‌లో బల్తాల్ మార్గాల గుండా జూన్‌ 29న యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 19న అమర్ నాథ్ ముగుస్తుంది. గతేడాది మంచులింగాన్ని 4.5 లక్షల మంది దర్శించుకున్నారు. మరోవైపు, అమర్‌నాథ్ ఆలయం వద్ద గరిష్టంగా 15 డిగ్రీలు, రాత్రి సమయంలో 5 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


Similar News