పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2న అఖిలపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2023-11-27 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2న అఖిలపక్ష అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 3 న జరగాల్సిన ఈ అఖిలపక్ష సమావేశం.. ఆ రోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు ఉండటంతో ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ అనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

ఎన్నికల ఫలితాలు సెషన్‌లో ప్రతిధ్వనిస్తాయని భావిస్తున్నారు. IPC, CrPC, ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేయడానికి ఉద్దేశించిన మూడు ముఖ్యమైన బిల్లులను సెషన్‌లో పరిశీలనకు తీసుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆమెను బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వం తన శాసనసభ ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్షాలు తమకు సంబంధించిన సమస్యలపై చర్చకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News