అజిత్ దోవల్.. అంతర్జాతీయ సంపద

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అంతర్జాతీయ సంపదగా మారారని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు.

Update: 2023-06-14 07:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అంతర్జాతీయ సంపదగా మారారని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ లోని ఓ మారుమూల గ్రామం నుండి వచ్చిన అజిత్ దోవల్ ఇప్పుడు జాతీయ సంపదగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంపదగా మారారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు ఈ ప్రశంసలు రావడం ఆసక్తిగా మారాయి. మోడీ యూఎస్ టూర్ నేపథ్యంలో ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. మోడీ పర్యటన కోసం బైడెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. మోడీ అమెరికా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News