Air India: ఎయిరిండియా విమానంలో బొద్దింక పడి ఉన్న ఆహారం

ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడి ఆహారంలో బొద్దింక కన్పించింది. రెండేళ్ల బాలుడు బొద్దింక పడి ఉన్న ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు ఎయిరిండియాకు ఫిర్యాదు అందింది.

Update: 2024-09-29 05:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడి ఆహారంలో బొద్దింక కన్పించింది. రెండేళ్ల బాలుడు బొద్దింక పడి ఉన్న ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు ఎయిరిండియాకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 17న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల బాలుడి తల్లి బొద్దింక పడిన భోజనాన్ని, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎయిరిండియా, డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ట్యాగ్ చేశారు. "మేం బొద్దింకను చూసేసరికి నాతో పాటు మా రెండేళ్ల కుమారుడు సగానికి పైగా భోజనం తిన్నాడని.. దీంతో ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడ్డాడు” అని సుయేష సావంత్ అనే ప్రయాణికురాలు సోషల్ మీడియా ఎక్స్ లో తెలిపింది.

ఎయిరిండియా స్పందన

ఎయిరిండియా ప్రతినిధి ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు కోసం క్యాటరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రతినిధి హామీ ఇచ్చారు. ఆహార నాణ్యతను నిర్ధారించడానికి కఠినమైన విధానాలను అనుసరించే ప్రముఖ గ్లోబల్ క్యాటరర్‌లతో విమానయాన సంస్థ పనిచేస్తుందని నొక్కి చెప్పారు. భవిష్యత్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దర్యాప్తు ఆధారంగా అవసరమైన చర్యలు చేపడతామని ఎయిర్ లైన్స్ హామీ ఇచ్చింది.


Similar News