PM Modi: 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యలో కొలువయ్యాడు- మోడీ
ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమని ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది దీపావళి ప్రత్యేకమని ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) అన్నారు. ఉపాధి మేళా కింద ప్రభుత్వ సంస్థల్లో ఎంపికైన 51 వేల మంది అభ్యర్థులకు మోడీ వర్చువల్ గా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేశప్రజలందరికీ ధన్‌తేరస్(Dhanteras) శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి దీపావళి చాలా ప్రత్యేకమైనదని ఆయన అన్నారు. 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీరాముడు అయోధ్యలోని(Ayodhya temple) తన నివాసంలో కొలువైనట్లు తెలిపారు. ఈ దీపావళి కోసం ఎన్నో తరాలు గడచిపోయాయని, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, హింసను భరించారని అన్నారు. అటువంటి ప్రత్యేకమైన, గొప్ప దీపావళిని(Diwali) చూస్తున్న అందరం అదృష్టవంతులమని తెలిపారు. పండుగ సమయాన నియమకపత్రాలు అందజేస్తున్నాని తెలిపారు.
ఉద్యోగ కల్పన
దేశంలోని లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని మోడీ అన్నారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలిచ్చమన్నారు. హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 26 వేల మంది యువతకు ఉద్యోగాలు అందించామన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వనికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉద్యోగాలు పొందిన యువతకు ధన్యవాదాలు తెలిపారు.