Dharma Productions: ధర్మా ప్రొడక్షన్స్ లో సీరం ఇన్ స్టిట్యూట్ భారీ పెట్టుబడులు

బీటౌన్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ లో భారీగా పెట్టుబడులు జరిగాయి.

Update: 2024-10-21 09:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీటౌన్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్(Dharma Productions) లో భారీగా పెట్టుబడులు జరిగాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla)కు పెట్టుబడులు పెట్టారు. ధర్మా ప్రొడక్షన్‌లో పూనావాలా ఏకంగా రూ.వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో, ధర్మా ప్రొడక్షన్‌లోని 50 శాతం వాటాను అదర్‌ పూనావాలా నేతృత్వంలోని సెరెన్‌ ప్రొడక్షన్స్‌ (Serene Production) దక్కించుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే, ఇక ఈ డీల్‌ తర్వాత ధర్మా ప్రొడక్షన్స్‌ విలువ ఏకంగా రూ.రెండు వేల కోట్లకు పెరుగుతుందని సెరీన్‌ ప్రొడక్షన్‌ పేర్కొంది.

ధర్మా ప్రొడక్షన్స్ తో ఒప్పందం

అయితే, మొదట్లో ధర్మా ప్రొడక్షన్స్‌ (Dharma Productions)ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపించాయి. అయితే, చివరికి మాత్రం పూనావాలాకు చెందిన సెరీన్ ప్రొడక్షన్ తో కరణ్ జోహార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇకపై ధర్మా ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కరణ్‌ జోహార్‌ సినిమా నిర్మాణం చూసుకుంటారని, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపూర్వ మెహతా పొడక్షన్ ఆపరేషన్స్‌ చూసుకుంటారని స్పష్టం చేసింది. భారత సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని.. ప్రేక్షకుల అభిరుచి మేరకు హై-క్వాలిటీ కంటెంట్‌ను క్రియేట్ చేయడంపై తమ ప్రొడక్షన్ దృష్టిసారిస్తుందని తెలిపింది.


Similar News