ఇందిరా‌ గాంధీపై నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. మరోసారి నిప్పు రాజేసిందా!

కంగనా రనౌత్‌.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Update: 2024-02-11 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంగనా రనౌత్‌.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనతి కాలంలోనే తక్కువ చిత్రాల్లో నటించి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. కంగనా సినిమాల్లో కంటే బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఎక్కువ పాపులర్ అయ్యింది. అటు సినీ రంగంలోనూ.. ఇటు రాజకీయాల్లో ఇండైరెక్ట్‌గా బీజేపీకి సపోర్ట్ చేస్తూ.. జోడు గుర్రాల స్వారీ చేస్తోంది. ఆ విషయం అటుంచితే.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న దేశంలో రాజకీయాలు హీటెక్కాయి. పోటీకి సై అంటూ ఆయా పార్టీల అధినేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు. తమకు నచ్చిన కూటమిలో చేరి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందరా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే ఆమె తెలుగు మూవీ రజాకార్, ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఓ రిపోర్టర్ ‘మీరు దేశ ప్రధాని కావాలని ఎప్పుడైనా అనుకున్నారా’ అని ప్రశ్నించారు. అందుకు కంగనా చిరునవ్వు నవ్వి.. ‘నేను ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించా. ఆ సినిమా చూశాక నన్ను ఎవ్వరూ ప్రధానిగా ఉండాలని కోరుకోరు’ అంటూ కామెంట్ చేసింది. అయితే, ఇది విన్న రిపోర్టర్లు, ముఖ్య అతిథులు తెలిసి చెప్పిందా.. తెలియక చెప్పిందా అని అవాక్కయ్యారు. అలాగే ఆమె మరో కామెంట్ కూడా చేశారు. ‘తాను రాజకీయాలకు సరిపోయే వ్యక్తిని కాదని, సున్నిత మనస్తత్వం గల దానిని. చాలా మంది నన్ను రాజకీయాల్లో రమ్మని అడిగారు. కానీ, నేను ఆ సహసం చేయలేనని వారి చేప్పేశాను’ అని సమాధానం ఇచ్చింది. 


Similar News