బల్లితో స్నేహం చేస్తున్న వ్యక్తి.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు(వీడియో)
ఈ ప్రపంచంలో జంతు ప్రేమికులను ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం.
దిశ, ఫీచర్స్: ఈ ప్రపంచంలో జంతు ప్రేమికులను ఎంతో మందిని చూస్తూనే ఉన్నాం. జంతు ప్రేమికులంటే.. పెట్ డాగ్స్, పిల్లుల వంటి జంతువులను పెంచుకునే వారిని చూశాం. అరుదుగా ఎప్పుడో ఒకసారి విషసర్పాలని తెలిసిన ఎలాంటి భయం లేకుండా పాములను మెడలో వేసుకుని ఆడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో చూశాం. అయితే తాజాగా ఓ వ్యక్తి-బల్లి మధ్య స్నేహం నెట్టింట జనాలను ఆశ్చర్యపరుస్తుంది. బల్లి-వ్యక్తి మధ్య ఫ్రెండ్షిప్ ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.
బల్లి మీద పడితే అరిష్టంలా భావింవి.. స్నానం చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బల్లితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన దినేశ్ లోధి అనే ఓ వ్యక్తి కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే నెల రోజుల క్రితం దినేశ్ ఇంట్లో పడుకుని ఉండగా.. అతని షర్ట్ జేబులోకి బల్లి దూరింది. మార్నింగ్ లేచి చూడగానే జేబులో బల్లి కనిపించగా తీసి బయట పారేశాడు. అయినా కూడా ఆ బల్లి మళ్లీ దినేశ్ ఇంట్లోకి వచ్చింది. ఆ బల్లి ఇంట్లోకి వచ్చి ఓ మూలన కుదురుగా ఉంటుందా? లేదు.
ప్రతిరోజూ దినేశ్ దగ్గరకు వచ్చి దీనంగా చూస్తూ మనమిద్దరం ఫ్రెండ్స్ నన్ను పదే పదే బయట పడేయకు అని అతన్ని వేడుకుందట. దీంతో ఆ మూగ భాష అర్థం చేసుకున్న దినేశ్ ఆ బల్లితో స్నేహం చేయడం మొదలుపెట్టాడట. ఇక అతను ఎక్కడికి వెళితే బల్లిని కూడా అక్కడికి తీసుకెళ్తాడట. దినేశ్ పని చేసుకునే టైం లో బల్లి.. అక్కడే ఉన్న ప్రాంతాల్లో షికారు కొడుతుందట. దినేశ్ ఇంటికి వెళ్లే సమయానికి మళ్లీ అతడి పని ప్లేస్‌కు చేరుకుంటుందట.
అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దినేశ్ బల్లి కోసం స్పెషల్‌గా క్వాలిటీ స్వెటర్ కొన్నాడట. ఎండలోనే పనిచేసే దినేశ్‌తో పాటు ఉండే బల్లి అతడు వేసుకునే స్వెటర్లోనే దినేశ్ పనికి విసుగు కలిగించకుండా చలికాచుకుంటుందట. అయితే గతంలో దినేశ్‌కు పాము కుట్టిందట. దీంతో అతడు పాము విషాన్ని తొలగించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారట. ఇప్పుడు తనతో పాటు ఉండే బల్లి రెండు, మూడు సార్లు కోపంలో కుట్టిందట. కానీ దినేశ్‌కు ఎటువంటి అపాయం కలగలేదట. దీంతో దినేశ్ కొత్త ఫ్రెండ్‌తో ఎలాంటి ప్రమాదం లేదని ఏం చక్కా బల్లితో స్నేహం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.