Air Pollution : కాలుష్యం ఎఫెక్ట్.. కృత్రిమ వర్షాల ఆలోచనలో ఢిల్లీ సర్కార్!
వాయు కాలుష్యం(Air Pollution)తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఢిల్లీ(Delhi) దానిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
దిశ, వెబ్ డెస్క్ : వాయు కాలుష్యం(Air Pollution)తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఢిల్లీ(Delhi) దానిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో కృత్రిమ వర్షాలు(Artificial Rains) కురిపించేందుకు చర్యలు తీసుకోవాలని అతిశీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణంగా గాలి నాణ్యత 500 ఎక్యూఐ(AQI)కి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమయిన గాలి కాలుష్యం గల నగరాల్లో ఢిల్లీ ఒకటి. ప్రతి ఏడాది ఈ నగరం కాలుష్య సమస్యను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది గాలి నాణ్యత మరీ తక్కువకు పడిపోవడం ఆందోళనకరంగా మారింది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ఆప్ సర్కార్(AAP Govt) చర్యలు మొదలు పెట్టింది. నగరం మీద కృత్రిమ వర్షాలు కురిపించేలా చూడాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి ఉత్ప్రేరకాలు మేఘాలపై చల్లడం ద్వారా.. మేఘాల్లోని తేమ కరిగి వర్షం రూపంలో కురుస్తుంది. కాగా కృత్రిమ వర్షం వలన పూర్తిగా కాలుష్యం తొలగక పోయినా కొంతవరకు మాత్రం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ సర్కార్ రిక్వెస్ట్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read More...
Air Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి పడిపోయిన గాలినాణ్యత.. 500కి చేరుకున్న ఏక్యూఐ