Air India: థాయ్‌లాండ్‌లో ఆగిపోయిన విమానం.. 80 గంటలు ప్రయాణికుల తీవ్ర అవస్థలు

న్యూఢిల్లీ(New Delhi)కి రావాల్సిన ఎయిరిండియా విమానం(Air India Flight) 80 గంటలు ఆలస్యం కావడంతో దాదాపు 100 మంది ప్రయాణికులు థాయ్ లాండ్(Thailand) లో చిక్కుకున్నారు.

Update: 2024-11-19 15:33 GMT

దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీ(New Delhi)కి రావాల్సిన ఎయిరిండియా విమానం(Air India Flight) 80 గంటలు ఆలస్యం కావడంతో దాదాపు 100 మంది ప్రయాణికులు థాయ్ లాండ్(Thailand) లో చిక్కుకున్నారు. సాంకేతిక లోపాల కారణంగా ఈ ఆలస్యం జరిగిందని ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 16 తేదీన రాత్రి ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానం థాయ్‌లాండ్ లోని ఫుకెట్(Phuket) నుంచి న్యూఢిల్లీకి రావాల్సి ఉంది. విమానం బయలు దేరడానికి సిద్దం అయ్యాక సాంకేతిక లోపం(Technical Glitch) కారణంగా ఆరు గంటలు ఆలస్యం(Delayed) అవుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ఈ విమానాన్ని మరుసటి రోజుకు రీషేడ్యూల్ చేయబడిందని చెప్పారు. తర్వాత రోజు ఎయిర్ ఇండియా సంస్థ మరో విమానాన్ని సిద్దం చేసి, సాంకేతిక లోపాన్ని సరిచేసి అదే విమానాన్ని సిద్దం చేశారని సిబ్బంది తెలిపారు.

ఈ సారి విమానం న్యూఢిల్లీకి బయలు దేరింది కానీ, మళ్లీ రెండున్నర గంటల తర్వాత తిరిగి ఫుకెట్ లోనే ల్యాండ్ చేశారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. సాంకేతిక లోపం ఉందని చెప్పారని, కానీ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(Flight Duty Time Limitations) (ఎఫ్‌డిటిఎల్)(FDTL) సమస్యలను గుర్తించి తిరిగి వెనక్కి తీసుకొచ్చినట్లు ప్రయాణికులు పోస్టింగ్ లలో పంచుకున్నారు. దీనిపై ఎయిర్ ఇండియా(Air India) స్పందిస్తూ.. అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని, ప్రయాణికులకు వసతి, భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కాంప్లీమెంటరీ కింద పూర్తి వాపసు అందించబడుతుందని తెలిపింది. అయితే దీనిపై అసహనం వ్యక్తం చేసిన కొందరు తిరిగి వెనక్కి వెళ్లిపోగా.. మరో వంద మంది ప్రయాణికులు 80 గంటలుగా ఫుకెట్ లోనే చిక్కుకొని పోయారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags:    

Similar News